అవిసెగింజలతో
రక్తపోటుకు చెక్
అవిసెగింజలతో (flax seeds) రక్తపోటును అదుపు చేయవచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అవిసెగింజలను క్రమం తప్పకుండా ప్రతిరోజూ 30 గ్రాముల చొప్పున తిన్న వారిలో పన్నెండు వారాల వ్యవధిలోనే రక్తపోటు అదుపులోకి వచ్చిందని, ఏడాది వ్యవధిలో గణనీయంగా తగ్గిందని వారు చెబుతున్నారు.
ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే, అవిసె గింజలు తినేవారిలో రక్తపోటు ఆశ్చర్యకరంగా అదుపులోకి వచ్చిందని డాక్టర్ డెల్ఫిన్ రోడ్‌రిగ్జ్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, అవిసెగింజలు తినడం వల్ల రొమ్ముకేన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని రెండేళ్ల కిందట జరిగిన మరో అధ్యయనంలో తేలింది.

No comments:
Post a Comment