chitika

Flag Counter

chitika

Search This Blog

Monday, 23 February 2015

IMPORTANCE OF LORD GANAPATHI ACCORDING TO INDIAN PURANAS


హిందూమతంలో ప్రణవ మంత్రం అయిన ఓంకారము స్వరూపమే వినాయకుడని అంటారు.
 వినాయకుడి రూపము ఓంకారంలా ఉంటుందని చెబుతుంటారు.
 (ముఖ్యంగా దేవనాగరి, తమిళ లిపులలో)గణపతి అధర్వశీర్షంలో ఈ విషయం ఇలా ఉంది:
గణపతీ! నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవు. నీవే ఇంద్రుడవు. నీవే అగ్నివి, వాయువువు, సూర్యుడవు, చంద్రుడవు, నీవే భూలోకము, అంతరిక్షము, స్వర్గము. నీవే ఓంకారము.
మూలాధార చక్రము
కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. ఈ చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు.గణపతి అధర్వశీర్షంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు.
వినాయక స్వరూపానికి వివరణ
వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్ధ వివరణలు, కథలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.
వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు ఈ విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
చేతిలో పాశము - విఘ్నాలు కట్టిడవసే సాధనము
విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
మాల - జ్ఙాన సముపార్జన
పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.
ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32
1 శ్రీ గణపతి
2 వీర గణపతి
3 శక్తి గణపతి
4 భక్త గణపతి
5 బాల గణపతి
6 తరుణ గణపతి
7 ఉచ్చిష్ట గణపతి
8 ఉన్మత్త గణపతి
9 విద్యా గణపతి
10 దుర్గ గణపతి
11 విజయ గణపతి
12 వృత్త గణపతి
13 విఘ్న గణపతి
14 లక్ష్మీ గణపతి
15 నృత్య గణపతి
16 శక్తి గణపతి
17 మహా గణపతి
18 బీజ గణపతి
19 దుంఢి గణపతి
20 పింగళ గణపతి
21 హరిద్రా గణపతి
22 ప్రసన్న గణపతి
23 వాతాపి గణపతి
24 హేరంబ గణపతి
25 త్ర్యక్షర గణపతి
26 త్రిముఖ గణపతి
27 ఏకాక్షర గణపతి
28 వక్రతుండ గణపతి
29 వరసిద్ధి గణపతి
30 చింతామణి గణపతి
31 సంకష్టహర గణపతి
32 త్రైలోక్యమోహనగణపతి
ముద్గల పురాణాన్ని అనుసరించి 32 గణపతులు ఉన్నారు.
బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి
5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి
9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి
13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి
16. ఊర్ద్వ గణపతి
17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి
21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి
25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి
29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి
ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.
నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.
విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.
1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి
4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి
7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి
10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి
13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి
ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.
శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...
1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి
5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ
10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి
14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి
18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ

No comments:

Post a Comment

My Blog List

chitika