యమపురి దారి ఎలా ఉంటుంది?
మనిషి ఆయువు తీరిన పదమూడో రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళతారు. దారి అంత ఎగుడుదిగుడులు. ఆకలిదప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బ లెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారు. కనుచూపులోనే నీరుంటుంది. త్రాగబోతే చేతికి అందదు . మేహమేఘాలు నిరంతరం వర్షిస్తుంటాయి. అయితే అవి వర్షించేది నీరు కాదు రక్తాన్ని. అలా పదిహేడు రోజుల పాటు జీవించినపుడు చేసిన పాపాలను తలచుకొని వాపోతుంటాడు జీవుడు . ఆ తరువాతే యమపురి మజిలీ అయిన సౌమ్యపురం చేరతాడు.
river vaitarani
వంద యోజనాల వెడల్పుతో ఉంటుంది. అందులో చిక్కని రక్తం. దానితో పాటు చీము కూడా. మహా జలచరాలు . ఒక్క క్షణం కూడా భరించలేని వాసనా. ఎన్ని దీనాలాపనలు చేసిన పాపి అక్కడ తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాల్సిందే.
అందుకనే తమ వారి కోసం భువిపై వారిపేరు మీద గోదానం చేస్తారు. గోదానం చేస్తే వైతరిణి నదిని సులభంగా దాటగలరని గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి తెలియ చెప్పాడు
No comments:
Post a Comment