chitika

Flag Counter

chitika

Search This Blog

Tuesday 2 September 2014

LIST OF BEST DAYS FOR POOJA OF LORD HANUMAN



ఆంజనేయుని పూజకు పర్వదినాలు

* చైత్రమాసం- పుష్యమీ నక్షత్రం
* వైశాఖమాసం - ఆశ్లేషా నక్షత్రం
* వైశాఖమాసం- కృష్ణపక్ష దశమీ హనుమజ్జయంతి
* జె్యైష్ఠమాసం- మఖా నక్షత్రం
* జె్యైష్ఠశుద్ధ విదియ- దశమి దినములు
* ఆషాఢ మాసం - రోహిణి నక్షత్రం
* శ్రావణ మాసం - పూర్ణిమ
* భాద్రపద మాసం - అశ్వనీ నక్షత్రం
* ఆశ్వీయుజ మాసం - మృగశీర్షా నక్షత్రం
* కార్తీక మాసం - ద్వాదశి
* మార్గశీర్ష మాసం - శుద్ధ త్రయోదశి
* పుష్య మాసం - ఉత్తరా నక్షత్రం
* మాఘ మాసం - ఆర్ధ్రా నక్షత్రం
* ఫాల్గుణ మాసం - పునర్వసు నక్షత్రం

హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆదివారములు స్వామి వారికి ప్రీతిదాయకములు. పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. అదియును పర్వదినము. ప్రతి శనివారము స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు. వైధృతియోగయు నందు (అనగా ఉత్తమము, అపూర్వము అగు గ్రహయోగకాలము, విష్కం భాది 27 యోగాలలో చివరిది వైధృతి యోగము) స్వామిని పూజించిన విశిష్ట ఫలసిద్ధి ప్రాప్తించును. ఆంజనేయస్వామి సప్తపదనుడనియు, ఏకాదశ శీర్షుడనియు తెలియుచున్నది.
శ్రీహనుమత్స్యామికి అరటి తోటలంటే మిక్కిలి ఇష్టము. కావున స్వామిని కదళీవనములందు పూజించిన శుభము చేకూరును. మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరము. అటులే పారిజాతములు, మందారములు, నందివర్ధనము, మల్లెలు, గన్నేరుమున్నగు పుష్పములు స్వామికి ఆనందము కలిగించును. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములు ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, కొబ్బరి, పనస, నేరేడు మున్నగు ఫలములు స్వామి వారికి మిక్కిలి ఇష్టము.సింధూరము, సింధూరాక్షతలు, పసుపు లక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, కర్జూరము మొదలగు పూజాద్రవ్యములు, పాయసము, పొంగలి, అప్పములు, వడలు, వడపప్పు, పానకము, పాలు మొదలగు నివేదన ద్రవ్యములు స్వామికి నివేదించిన, స్వామి సంతుష్టుడగును. ఆవు నేతితో చేసిన దీపారాధన శ్రేష్టము.
ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం
విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం
ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం
నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం
ఇలా స్వామిని నిత్యం ధాన్యం చేయాలి.

No comments:

Post a Comment

My Blog List

chitika