chitika

Flag Counter

chitika

Search This Blog

Thursday, 25 September 2014

TELUGU MAHABHARATHA STORIES - WHAT IS AKSHOUHINI ? THE TERM USED FOR MAHABHARATHA BATTLE


అక్షౌహిణి అంటే?

మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నదని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే, అక్షౌహిని అంటే ఎంత అనే ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వడం అందరికి సాధ్యం కాదు. ఈ సంఖ్యను నిఘంటువులు తెలియజేస్తున్నా, అది బహిస్స్వరూపం మాత్రమే, పరిపూర్ణ స్వరూపం చాలా మందికి తెలియదు.

మహాభారత ఆఇ పర్వంలోని ప్రథమాశ్వాసంలో ఎనభైయువ పద్యంలో నన్నయ్య అక్షౌహిణి స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు.

సీ!! వరరథి మొక్కండు వారన మొక్కండు

తురగముల్ మూడు కాల్వరున్ నేవు

రమ సంఖ్య గలయది యగు బత్తి:

యది త్రిగుణంబైన సేనాముఖంబు:

దీని త్రిరుణంబు గల్మంబు, దీని మమ్మడుగగు

గుణము, తద్గనము త్రిగుణీతమైన

వాహినయగు దాని వడి మూట గణియింప

బౄతననాబరగు దతౄతన మూట

ఆ!! గునీతమైన జము వగున్ : మరి దానిము

మ్మడుగనీకిని సమాఖ్యనొనరు:

నదియుబదియడుంగులైన నక్షౌహిణి

యౌనిరంతర ప్రమాను సంఖ్య.

అంటే ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు కలిసిన సైన్యానికి ‘పత్తీ అని పేరు. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖమూ అంటారు. దీనికి మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు.

సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మమూ అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణమూ ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహినీ. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు.

వాహినికి మూడు రెట్లు ‘పౄతనా ఇందులో 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లుంటారు. పౄతనకు మూడు రెట్లు ‘చమువూ ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.

చముకు మూడు రెట్లు ‘అనీకినీ. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణీ అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం ఏదు అక్షౌహిణులు మాత్రమే. 8 అక్షౌహిణులు ఒక ఏకము. ఎనింది ఏకములు ఒక కోటి (ఈ కోటి వేరు), ఎనిమిది కోట్లు ఒక శంఖము, ఎనిమిది శంఖములు ఒక కుముదము, ఎనిమిది కుముదములు ఒక పద్మము, ఎనిమిది పద్మములు ఒక నాడి, ఎనిమిది నాడులు ఒక సముద్రము, ఎనిమిది సముద్రాలు ఒక వెల్లువ. అంటే 366917139200 మంది గల సైన్యానికి వెల్లువ అని పేరు. ఇటువంటి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుని వద్ద వున్నట్లుగా కంబరామాయణం చెబుతుంది. అంటే సుగ్రీవుని వద్ద 256842399744000 మంది వానర వీరులున్నారన్నమాట. వీరిలో 67 కోట్ల మంది సైన్యాధిపతులు. వీరికి నీలుడు అధిపతి. అక్షౌహిణికి ఇంత కథ ఉన్నది.

No comments:

Post a Comment

My Blog List

chitika