chitika

chitika

Search This Blog

Friday, 18 July 2014

BRIEF HISTORICAL FACTS ABOUT SRI KALAHASTHI TEMPLE AT CHITTOOR DISTRICT - ANDHRA PRADESH - INDIA


శ్రీ కాళహస్తి క్షేత్ర మహిమ

చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను

సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి ఐఖ్యమొందిరి.

ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా-హస్తి అని పేరు వచ్చింది

No comments:

Post a Comment

My Blog List

chitika