chitika

Flag Counter

chitika

Search This Blog

Wednesday 28 January 2015

ARTICLE ABOUT THE LEGENDARY SAGE OF INDIA - SRI OURYA MAHARISHI SON OF APRAVANANA SON OF CHAVANYA SON OF BRUGUVU


ఔర్వ మహర్షి

భృగుని కుమారుడు చ్యవనుడు. చ్యవనుని పుత్రుడు అప్రవానుడు. అప్రవానునకు ఋచి అను భార్య వలన ఔర్వ మహర్షి జన్మించాడు. ఋచియూరువు మఋగున పుట్టినవాడగుటచే అతడు ఔర్వుడయ్యాడు. ఔర్వుడు చిన్నప్పటి నుంచి తపస్సులో ఉండేవాడు. ఆయన తపశ్చక్తి అనలముగా మారినది. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగునని అతని పిత్రుదేవతలు ఔర్వని చేరి “కుమారా నీ తపోశ్శక్తిచే జనించిన అగ్నిని సముద్రమున విడిచి పెట్టు, అది సముద్రమునుదహిస్తుంది. లేకపోతే ఉపద్రవములు కలుగును" అని చెప్పగా ఔర్వుడు దానిని సముద్రంలో వదిలి పెట్టాడు. అది ఔర్వానలమై గుఱ్ఱం ముఖంతో సముద్రజలమును త్రాగింది. అదే బడబానలం తర్వాత ఆయన బ్రహ్మచర్య దీక్ష చేయసాగాడు. అంత దేవతలు, రాక్షసులు ఆ మహర్షి వద్దకు వచ్చి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనమని పలికారు. అందుకు అతడు ఒప్పుకోలేదు. ఔర్వని బ్రహ్మచర్య దీక్షకు ఆశ్చర్యపడి హిరణ్యకశిపుడు శ్రద్ధా భక్తులతో ఆ మహర్షికి నమస్కరించి శిష్యునిగా స్వీకరించమని కోరగా ఒప్పుకొని అతనికి వరాలు ఇచ్చి శత్రు భయం ఉండదని చెప్పిపంపాడు.

ఔర్వుడు తన తపో మహిమతో తనమోకాలి నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. ఆమెకు ‘కందని’ అని పేరు పెట్టి పెంచాడు. అమె అందముగా ఉండేది కాని కలహప్రియ. యుక్తవయస్సు వచ్చాక ఆమెను దుర్వాసమహర్షి కిచ్చి పెళ్లి చేశాడు. దూర్వాసుడు భార్యతో చక్కగా ఉంటున్నాడు కాని తనకే కోపం ఎక్కువ అనుకుంటే భార్య మరీ కోపిష్టి. కటువుగా మాట్లాడుతుంది. ఉన్న కొద్ది ఆమె బాధ భరించలేక మహర్షి ఆమెను భస్మం చేశాడు. ఆ సంగతి ఔర్వునికి తెలిసి వచ్చి అల్లుడ్ని నిందించి అవమానాల పాలు అవుతావని శపించాడు. అయోధ్యను భాషుడనే రాజు పాలిస్తూండగా వేరే రాజులు దండెత్తి వచ్చి రాజ్యమాక్రమించుకున్నారు. భాషుడు నిండు గర్భవతి పట్టమహిషి అయిన భార్యతో కలిసి ఔర్వుని ఆశ్రమంకు వెళ్లాడు. ఆయన ఇంకొక భార్య తనకు గర్భం రాలేదని పట్ట మహిషికి ఎవరికి తెలియకుండా విషం పెట్టింది. ఆ సంగతి ఎవరికీ తెలియదు. ఆ విషంతో గర్భం స్తంభన అయి ఏడు సంవత్సరములు అయిన పురుడు రాలేదు. ఈ లోపు రాజు మరణించాడు. పట్టమహిషి సహగమనంకు సిద్దపడటం వల్ల ఔర్వుడు అమెను వారించాడు.

ఆమె గురువు మాట విని ఉంది. కొంతకాలానికి ఆమెకు మగబిడ్డ కలిగాడు కాని విషంతో సహా పుట్టాడు. ఆ సంగతి తెలిసి ఔర్వుడు ఆ బిడ్డకు సగరుడని పేరు పెట్టాడు. తల్లీ కొడుకూ ఆశ్రమంనందే ఉండి సమస్త విద్యలు నేర్చుకొని తల్లివల్ల విషయాలు తెలుసుకొని శత్రువుల మీదకు దండెత్తి అందర్నీ జయించి రాజ్యం పరిపాలించుచున్నాడు. సుమతి, సుకేళి అను కన్యలను పెళ్లి చేసుకున్నాడు. వారి వల్ల సంతానం కలగలేదు. భార్యలను వెంటబెట్టుకొని ఔర్వ మహర్షి దగ్గరకు వచ్చి సంతానం కావాలని ప్రార్థించాడు. గురువు కరుణతో సుకేళికి ఒక కుమారుడు, సుమతికి అరవై మంది పుత్రులు పుట్టారు. సగరుడు సంతోషించి గురువుకు నమస్కరించి తన రాజ్యంకు వెళ్లాడు. సగరుడు చాలా కాలం రాజ్యం చేసి విసిగి గురువును తత్వ బోధన చేయమని అడిగాడు. అనేక విషయములు చెప్పారు. ఔర్వ మహర్షికి తెలియనివి లేవు మేధావి, తపోనిధి, అస్కలిత బ్రహ్మచారి, అందరికీ ఉపకారం చేసేవారు

No comments:

Post a Comment

My Blog List

chitika