chitika

chitika

Search This Blog

Wednesday, 17 December 2014

ARTICLE ABOUT PURANA STORY OF MADHURA MEENAKSHI TEMPLE IN ENGLISH AND TELUGU


మీనాక్షి - Minakshi .
మీనాక్షి (IAST mīnākṣi , ఇంగ్లీషులో Meenakshi , తమిళంలో மீனாட்சி అని రాస్తుంటారు) ఒక హిందూ దేవత పార్వతి యొక్క అవతారం - మరియు శివుడి దేవేరి - దక్షిణ భారతీయులచే ప్రధానంగా పూజలందుకుంటుంది. తమ కోసం పెద్ద ఆలయం నిర్మించబడిన కొద్ది మంది హిందూ దేవతా స్త్రీలలో ఈమె కూడా ఒకరు - తమిళనాడు మదురైలోని సుప్రసిద్ధ మీనాక్షి అమ్మన్ ఆలయం. కుడివైపు ఉన్న చిత్రం ఆలయంలోని ఆమె విగ్రహాన్ని ప్రతిబింబిస్తుంది.
ఒకసారి ఇంద్రుడు ఒక అసురుడిని చంపాడు, ఆ అసురుడు ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. ఈ చర్యతో శాపానికి గురైన ఇంద్రుడు శాపవిమోచన కోసం దేశదేశాలూ సంచరించాడు. ఏం చేస్తే శాప విముక్తి కలుగుతుందో అతనికి చెప్పేవారు లేకుండా పోయారు. దేశదేశాలూ సంచరించిన తర్వాత ఒక అరణ్యంలో ఉన్న శివలింగం శక్తి మహిమతో అతడు బాధలనుండి విముక్తి పొందాడు. అందుచేత అతడు ఈ ప్రాంతంలో చిన్న ఆలయం కట్టించాడు.
ఆ సమయంలో దక్షిణ భారతదేశంలో మలయధ్వజ పాండ్యన్ [1] అనబడే పాండ్యన్ రాజు మనవూర్ పేరుగల చిన్న నగరాన్ని పాలించేవాడు, ఆ నగరం ఈ శివలింగానికి సమీపంలో ఉండేది. ఇతడు కులశేఖర పాండ్యన్ పుత్రుడు. ఇతడు శివలింగం విషయం తెలుసుకుని కదంబవనం అడవిలో శివుడికి పెద్ద ఆలయం నిర్మించాలని నిర్ణయించాడు, (వనం అంటే అడవి అని అర్థం). అలాగే అతడు ఈ ప్రాంతాన్ని మదురై అని పిలువబడిన గొప్ప రాజ్యంగా వృద్ధిపరిచాడు.
రాజుకు సంతానం లేకపోవడంతో రాజ్యానికి వారసుడికోసం వెతికాడు. అతడి ప్రార్థనలు మన్నించిన శివుడు అతనికి అయోనిజ శిశువును ప్రసాదించాడు (అయోనిజ అంటే గర్భం నుంచి జన్మించనిది అని అర్థం. మూడేళ్ల ఈ శిశువు వాస్తవానికి శివుడి దేవేరి పార్వతీ మాత అవతారం. ఈమె మూడు వక్షోజాలతో, చేప కన్నులతో జన్మించింది. ఆమె తన కాబోయే భర్తను కలుసుకున్నప్పుడు ఆమెకున్న అదనపు వక్షోజం మాయమవుతుందని భావించబడింది. ఈమెకు మీనాక్షి అని పేరుపెట్టారు, (అంటే చేప కన్ను అని అర్థం) mīna పదానికి (చేప అని అర్థం) మరియు అక్షి (అంటే కన్నులు) అని అర్థం.

విశ్వ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న నటరాజు శివుడు
ఈమె శివ-శక్తి తత్వంతో పెరుగుతూ వచ్చింది. రాజు మరణం తర్వాత, ఈమె చక్కటి పాలనాయంత్రాంగంతో రాజ్యాన్ని పాలించింది.
ఆమె సాగించిన యాత్రలలో ఒకసారి హిమాలయాలుకు వెళ్లింది, అక్కడ శివుడిని చూడటంతోటే ఆమె అదనపు వక్షోజం మాయమైపోయింది. చాలామంది దేవుళ్లూ, దేవతలూ వీరి పెళ్లిని తిలకించడానికి విచ్చేశారు.
మదురై లోని మీనాక్షి అమ్మవారి ఆలయంలోని గోపురం
పెళ్లి సంబరాల్లో దేవుళ్లు ఏర్పాటు చేసిన పెళ్ళి విందును స్వీకరించడానికి తిరస్కరించారు, ఆహూతుల వద్ద శివుడు మహా నృత్యం చేయకపోతే తాము ఆహారం స్వీకరించబోమని వీరు చెప్పారు. దీంతో శివుడు తన భార్య మీనాక్షి సమక్షంలో చిదంబరం నృత్యం, విశ్వ నృత్యం ప్రదర్శించాడు. ఈ నృత్యం అన్ని జీవన శక్తులను, సౌందర్యాన్ని ఒక్కటిగా కలిపి ప్రదర్శించింది. నృత్యం చివరలో మీనాక్షి శివలింగంతో కలిసిపోయింది మరియు జీవితం, సౌందర్యాల కలబోతగా మారింది.
ఆలయంలోని ఉత్తర గోపురం ("మొట్టై గోపురం") మీద చెప్పుకోదగ్గ శిల్పాలు ఎందుకు లేవనే దానిపై మరొక పురాణం ఉంది. భూతగణాలు ఆలయం గోపురాల నిర్మాణాన్ని రాత్రి పూట ముగించాలని భావించాయట. పురాణం ప్రకారం భూతగణాలు ఆలయంలోని మూడు గోపురాలను పూర్తి చేశారు కాని ఉత్తర గోపురం భవంతి మధ్యలో పని జరుగుతుండగా సూర్యుడు ఉదయించడంతో ఉత్తర గోపురం నిర్మాణాన్ని ఆపివేశారట.
పురాతనమైన సంగ అనంతర తమిళ సాహిత్య రచన అయిన శిలప్పదిగారం యుద్ధ దేవత అయిన తడాడగై ప్రతియార్ గురించి వర్ణిస్తుంది, ఆమె తలపై నెలవంక ఉంటుంది. రెండు చేతులలో ఎడమచేతిలో కమలం కుడి చేతిలో కత్తి పట్టుకుని ఉంటుంది. ఈ దేవత కుడి వేపున సింధూర వర్ణం మరియు ఎడమవైపున నల్ల రంగు ఉంటుందని వర్ణించబడింది - అర్ధనారీశ్వర రూపం . 10వ శతాబ్దం తర్వాత, తమిళనాడు ప్రాంతంలో శివ భక్తుల లక్ష్యాధ్యాయి ఆరాధన చాలా ప్రభావం చూపింది. దీని ఫలితంగా మీనాక్షి దేవి. కోసం మదురైలోని ప్రధానాలయంలో ఒక పత్యేక మందిరం రూపొందించబడింది. ఈమెను గోడ శాసనం తిరుకామకోటత్తు ఆలుడయ నాచ్చియార్ గా పేర్కొంది. అన్ని చోట్లా ఇవే మార్పులు కలిగాయి, ఉదాహరణకు, నటరాజు భార్య తిల్లై కాళీ దేవి చిదంబరం ముఖ్య ఆలయ విభాగంలో దేవి కోసం కట్టించిన కొత్త మందిరంలో శివకామవల్లి లేదా శివకామ కోటి గా పేరు మార్చబడింది.
మీనాక్షి దేవి లలితా సహస్రనామలో నేరుగా కనిపించదు, అయితే ఆమె గురించి చలన్ మీనాభ లోచనా ఆనే నామంలో ప్రస్తావించబడిందని కొందరి అభిప్రాయం. ఆమె కండ్లు ఇంకా పుట్టని వారికి ప్రాణంపోస్తాయి. మీనాక్షి దేవిని మంత్రశాస్త్రవేత్తలు మంత్రిణి, రాజశ్యామల,రాజమాతంగి అనే పేర్లు కలిగిన సంగీతాధిదేవత రూపంగా భావిస్తారు.
మీనాక్షి పంచ రత్నం (మీనాక్షీ దేవిపై అయిదు రత్నముల వంటి శ్లోకాలు) [2] ఆమెపై శంకరాచార్యులు వ్రాసినవిగా భావించబడుతున్నాయి. దేవతపై పలు ఇతర గొప్ప శ్లోకాలు కూడా ఉన్నాయి, వీటిని తదుపరి శతాబ్దాలలో సుప్రసిద్ధ నీలకంఠ దీక్షితార్‌ తో పాటు పలువురు మహర్షులు, పండితులు కూర్చారు.
మీనాక్షి దేవత కుండలు, పింగాణీ పాత్రలను తోముతున్న బాలికగా ఒక తమిళ పద్యం చూపించింది (వీటిలో అన్ని ప్రపంచాలు ఉన్నాయి.) ఇది రోజువారీ పనిగా ఉండేది, ఎందుకంటే ఆమె భర్త శివుడు విశ్వాన్ని పదే పదే అస్తవ్యస్తంగా మార్చేవాడు, మీనాక్షి దాన్ని క్రమపద్ధతిలోకి తీసుకువచ్చి శుభ్రపర్చేది.
శివుడు రోదసీ ప్రాంగణం గుండా సంచరిస్తుంటాడు
' మీ పనిని పదే పదే నాశనం చేస్తుంటాడు,
' తర్వాత మీరు నృత్యం చేయడానికి ముందు మీ వద్దకు వస్తాడు.
' నీకు ఎన్నటికీ కోపం రాదు.
' ప్రతి రోజూ నీవు ఈ పాత్రలను తీసుకు పోతుంటావు.
ముప్పై పదాల్లో, మీనాక్షి అసాధ్యులైన పిల్లలతో (లేదా భర్తలతో) వ్యవహరించే వారందరికీ విశ్వ నమూనాగా మారిపోతుంది.[1] పద్యాల ద్వారా నడిచే థీమ్‌లు మరియు యాక్టివిటీస్ చిన్నపిల్లవాడిలోని దేవుడు వంటగదిలోని, పెరట్లోని బొమ్మల మధ్య పూజించబడుతుంటాడు మరియు కాపాడబడుతుంటాడు
Meenakshi (IAST mīnākṣī, often written Meenakshi in English, Tamil மீனாட்சி, Telugu మీనాక్షీ ) is an Avatar of the Hindu Goddess Parvati - and consort of Shiva - who is worshipped mainly by South Indians. She is also one of the few Hindu female deities to have a major temple devoted to her - the far famed Meenakshi Amman Temple in Madurai, Tamil Nadu. The picture on the right shows her Deity at the temple. She is considered as a form of Goddess Lalitha Tripurasundari, one of the Dasa Maha Vidhyas.
The word Meenakshi (eyes shaped like a fish, i.e., almond eyes) is derived from the Tamil word meen (fish) and the word akshi (eyes). Since the Ancient Tamil Kingdom of Pandya emblem was a fish and their capital was the city of Madurai, the goddess of Madurai became known as Meenakshi.
The legend
Once Indra killed a demon, even though the demon had not harmed anyone. This act brought a curse upon Indra that forced him to become a wanderer. As he wandered, Indra found himself lost, and nobody would tell him the way to redeem him from his sin. After much wandering Indra was freed from his suffering through the power of a Shivalingam in a forest, and so he built a small temple at that site.
It so happened that at that time in South India there was a Pandyan king called Malayadhwaja Pandiyan ruling a small city by the name Manavur, which was quite near to this Shivalinga. He was the son of Kulashekara Pandyan. He came to know about the Shivalinga and decided to build a huge temple for Shiva in the forest Kadambavanam (vanam means forest). He also developed the region into a fine princely state called Madurai.
The king was childless and sought an heir for the kingdom. Shiva granted him his prayers through an Ayonija child (one born not from the womb). This child was three years old and actually the incarnation of goddess Parvati the consort of Shiva. She was born with fish-shaped eyes and an extra breast . It was said that the extra breast would disappear when she met her future husband. She was named Meenakshi, (meaning fish eyed) from the words meen (meaning fish) and akṣhi (meaning eyes). Meebnakshi also means "the one who has eyes like that of a fish". Fishes are said to feed their younger ones with their eyes, similarly goddess looks after her devotees. Just by her sight our miseries disappear.
Shiva the Nataraja performing the Universal dance
She grew up to be a Shiva-Shakti personification. After the death of the king, she ruled the kingdom with skillful administration.
In one of her expeditions she went to the Himalayas and there, on seeing Shiva, her extra breast disappeared. Many of the gods and goddesses came to witness their marriage.
One of the Gopuram of Meenakshi Amman Temple at Madurai
At the wedding celebrations the gods refused to have the served food unless Shiva performed a majestic dance for everybody gathered at the place. At this there was the dance of Chidambaram, the cosmic dance in front of his wife Meenakshi. It epitomised and merged all life force and beauty into one whole. In the end Meenakshi was merged with the shivalingam and became the representation of life and beauty.
There is another legend that talks about why the North Tower (called as "Mottai Gopuram") does not have that many sculptures. Bhootaganas were supposed to finish the construction of the temple towers during the night. Legend says that bhootaganas completed all three towers but while in the middle of building the north tower sunrise happened halting the completion of the north tower.
Meenakshi Devi
Silapadikaram, an ancient post sangam Tamil literature, describes the Goddess as ThadAdagai Pratiyar a warrior Goddess, with a crescent moon on her matted hair, with two arms the left holding a lotus and the right holding a sword. She is described as having the right side in crimson colour and the left in dark colour - ArdhanAri form. Meenakshi does not directly occur in the Lalita Sahasranama, though there is a reference to it in chalan meenabha lochana. Her eyes are fabled to bring life to the unborn.
The stotram Meenakshi Pancha Ratnam (five jewels of Meenakshi) [1], composed by Sri Adi Sankaracharya is an incantation to her. There are several other great hymns on the goddess, composed in the later centuries by many saints and scholars including the famous Neelakanta Dikshitar.
Literary references
A Tamil poem shows the goddess Meenakshi as a girl washing crockery and pots (which consist of all the worlds). This is a daily task, because her husband Shiva repeatedly messes up the universe, which Meenakshi must once more sort out and clean.
Shiva wanders through the courtyard of space
destroying your work again and again,
and then comes before you dancing.
You never get angry.
Every day, you just pick up the vessels.
In thirty words, Meenakshi becomes a global icon for all who deal with 'impossible' children (or husbands).[1] Themes and activities of early childhood run through the poems. God in the little child is worshipped and protected amidst the toys in the kitchen

My Blog List

chitika