chitika

Flag Counter

chitika

Search This Blog

Saturday 15 November 2014

FESTIVAL / GODS PUJA WITH LAMPS - HISTORY AND IMPORTANCE OF POOJA WITH DIYA


"దీపాలతో ఆరాధన - ఫలితాలు"

వెండి ప్రమిదల్లో నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూ నెతో కానీ, పొద్దుతిరుగుడు నూనెతో కానీ, దీపారాధన చేస్తే వారి కి వారి ఇంట్లోవారికి అష్ట నిధులు కలుగును. గణపతిని లక్ష్మీనారాయ ణ స్వామికి లలితా త్రిపుర సుందరీదేవీకి, రాజరాజేశ్వరీ అమ్మవారికి సాలగ్రామాలకు శ్రీగాయత్రీ మాతకు గానీ, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అనుకున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి. ఇవేకాకుండా వివిధ గ్రహాదిదేవతలు, దైవాలకు వెండి దీపాలతో ఆరాధన చేస్తే 
 క్రింది ఫలితాలు పొందవచ్చు.
1. శ్రీ మహాగణపతి - అడ్డంకులు తొలిగి పనులు సకాలంలో పూర్తవుతాయి.
2. సూర్యుడు - శత్రునివారణ, పేదరికం తొలగిపోతుంది.
3. చంద్రుడు - తేజోవంతులు, కాంతివంతులు కాగలరు.
4. కుజుడు - రక్తపోటు, ఆలోచనల తీవ్రత తగ్గుతుంది.
5. బుధుడు - బుద్ధివంతులు కాగలరు.
6. గురుడు - ఉదర సంబంధ రోగాలు తగ్గుతాయి.
7. శుక్రుడు - మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
8. శని - కష్టాలు, గుప్తరోగాలు తగ్గిపోతాయి.
9. రాహువు - సంపదలు కలుగుతాయి.
10. కేతువు - మంత్రసిద్ధి కలుగుతుంది.
11. శ్రీ సరస్వతి - జ్ఞానశక్తిని పొందుతారు.
12. మహాలక్ష్మీ - దారిద్య్రం తొలిగి, ఐశ్వర్యం కలుగుతుంది.
13. దుర్గాదేవి - శత్రు కష్టాలు తొలగిపోగలవు.
14. గంగాదేవి - పాపాలు తొలగిపోగలవు.
15. తులసీదేవి - సౌభాగ్యాలు కలుగును.
16. శివపార్వతులు - దాంపత్యజీవిత సుఖం.
17. లక్ష్మీనారాయణులు - జీవన్ముక్తి కలుగును.
18. మృత్యుంజయుడు - అకాల మృత్యునివారణ అవుతుంది.
19. శ్రీరాముడు - సోదరుల సఖ్యత కలుగుతుంది.
20. భైరవుడు - మూర్ఛ వ్యాధి పూర్తిగా నయమవుతుంది.

ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు...
1. మేషరాశి - త్రివత్తులు (3)
2. వృషభరాశి - చతుర్‌వత్తులు (4)
3. మిధునరాశి - సప్తవత్తులు (7)
4. కర్కాటకరాశి - త్రివత్తులు (3)
5. సింహరాశి - పంచమవత్తులు (5)
6. కన్యరాశి - చతుర్‌వత్తులు (4)
7. తులారాశి - షణ్ముఖ వత్తులు (6)
8. వృశ్చికరాశి - పంచమవత్తులు (5)
9. ధనుస్సురాశి - త్రివత్తులు (3)
10. మకరరాశి - సప్తమవత్తులు (7)
11. కుంభరాశి - చతుర్‌వత్తులు (4)
12. మీనరాశి - పంచమవత్తులు (5)
జన్మలగ్న రీత్యా వెలగించాల్సిన వత్తులు...
1. మేష లగ్నం - పంచవత్తులు (5)
2. వృషభ లగ్నం - సప్తమవత్తులు (7)
3. మిధున లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
4. కర్కాటక లగ్నం - పంచమవత్తులు (5)
5. సింహ లగ్నం - త్రివత్తులు (3)
6. కన్యా లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
7. తులా లగ్నం - సప్తమ వత్తులు (7)
8. వృశ్చిక లగ్నం - ద్వివత్తులు (2)
9. ధనుర్‌ లగ్నం - పంచమవత్తులు (5)
10. మకర లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
11. కుంభ లగ్నం - షణ్ముఖ వత్తులు (6)
12. మీన లగ్నం - ద్వివత్తులు (2)



No comments:

Post a Comment

My Blog List

chitika