chitika

chitika

Search This Blog

Monday, 8 September 2014

INDIAN ANCIENT MAHABHARATHA STORY ABOUT SIKHANDI IN TELUGU


శిఖండి
సంతానం లేని ద్రుపదుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భీష్ముని చంపే కొడుకు కావాలని అడిగాడు. "ముందు కూతురై పుట్టి తర్వాత కొడుకుగా మారి భీష్ముని చంపే సంతానం నీకు కలుగుతుంది." అని శివుడు వరమిచ్చాడు.
ఆ ప్రకారమే ద్రుపదుడికి కూతురు పుట్టింది. తల్లిదండ్రులిద్దరికి అసలు సంగతి ముందే తెలుసు గనుక తమకు కొడుకే పుట్టాడని అందరితోనూ చెప్పి ఆ పిల్లను పురుషవేషంలో పెంచారు. ఆమెకు శిఖండి అని పేరు పెట్టారు. శివుడి వరం సంగతి ఆమెకు చెప్పి ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్యాభ్యాసం చేయించడం మొదలుపెట్టారు.
కూతురికి యుక్తవయస్సు వచ్చాక పెళ్ళి చెయ్యాలనుకుని, ఈశ్వరుని వరం తలుచుకుని ధైర్యం తెచ్చుకుని, దశార్ణదేశ ప్రభువు హేమవర్మ కూతుర్ని తెచ్చి పెళ్ళి చేశారు. ఆ పెళ్ళికూతురు చాలా తెలివైనది. శిఖండి అజాగ్రత్తగా ఉన్న సమయంలో అసలు సంగతి పసికట్టి తన దాసికి చెప్పింది. ఆ దాసి వెళ్ళి హేమవర్మ చెవిలో వేసిందా సంగతి. ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. "కొడుకని చెప్పి కూతురికి మరో కన్య నిచ్చి పెళ్ళి చేశావు. ఇందువల్ల నగుబాటు తప్ప మరేం జరిగింది నీకు? నన్ను అవమానించావు. కొడుకని చెప్పిన నీ కూతురికెలాగు పురుషత్వం లేదు. నీకైనా మగతనం వుంటే యుద్ధంలో చూపించు" అన్నాడు.
: ఏం మాటలయ్యా ఇవి! కూతుర్ని కొడుకని చెప్పుకోవల్సిన గతేమిటి నాకు? ఎవరో గిట్టనివాళ్ళు ఎదో చెప్పి వుంటారు మీకు . నావంటివాడి మర్యాదైనా ఆలోచించకుండా మాట్లాడటం ధర్మమేనా?" అన్నాడు ద్రుపదుడు."అయితే మనిద్దరం ఇప్పుడే నిజానిజాలు తేల్చుకుంటే సరిపోతుందిగా?" అన్నాడు హేమవర్మ.
"అబ్బే! అలా చేస్తే అబ్బాయిని అవమానించినట్టవుతుంది. ఎందుకూ కొద్దిరోజుల్లో అబ్బాయి అత్తవారింటికోసారి రావాలిగా?" అని మెల్లగా నచ్చజెప్పి పంపించేసాడు ద్రుపదుడు.
ఇదంతా తెలిసి శిఖండి ఆ అవమానం భరించలేక మరణమే శరణ్యమనుకుని ఎవరికీ చెప్పకుండా అడవికి పారిపోయింది. అక్కడున్న యక్షుడొకడు ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నాలను గమనించి "అమ్మాయీ! ఎమిటీ చావు ప్రయత్నం? నీ బాధేమిటో చెప్పు. నేను తీరుస్తాను" అన్నాడు. "ఇప్పుడు నాకు పురుషత్వం వస్తే తప్ప ఈ బాధ తీరదు" అని తన కధంతా పూసగుచ్చినట్టు చెప్పింది శిఖండి. యక్షుడికి జాలేసింది. "ఇంతే కదా! న అపురుషత్వం నీకిస్తాను. వెళ్ళీ మీ అత్తింట సందేహం పోగొట్టి మళ్ళీ పదిరోజుల్లో తిరిగిరా.అంతవరకు నీ కన్యాత్వం నేను భరిస్తూ ఉంటాను. నా పురుషత్వం నాకిచ్చేద్దువు గాని" అని ఓదార్చి తన పురుషత్వాన్ని శిఖండికి ఇచ్చాడు యక్షుడు.
శిఖండి ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో జరిగిన సంగతి చెప్పేసరికి వాళ్ళూ ఆనందపడిపోయారు. ద్రుపదుడు హేమవర్మను పిలిపించి శిఖండి మగవాడని నిరూపించాడు. హేమవర్మ తన తొందరపాటుకి సిగ్గుపడ్డాడు.
పది రోజులయ్యాక యక్షుడికిచ్చిన మాట ప్రకారం శిఖండి అరణ్యానికి తిరిగి వచ్చాడు."మహాత్మా! నా పరువు దక్కించావు. నీ పురుషత్వం నువ్వు తీసుకో" అన్నాడు. "నాయనా! నువ్వు అదృష్టవంతుడివి. ఇక నువ్వు నీ జీవితాంతం పురుషుడిగానే ఉంటావు. ఇది దైవ నిర్ణయం" అన్నాడు యక్షుడు.సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు శిఖండి.
"నాయనా! నువ్వు వెళ్ళాక ఒకనాడు కుబేరుడు వచ్చాడు. ఈ ఆడరూపుతో ఆయన ముందుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డాను. ఆయనకు కోపం వచ్చింది. కాని నా సంగతంతా తెలుసుకుని కూడా రమ్మనేసరికి నేను వెళ్ళి ఆయన పాదాలు తాకాను."స్థూలకర్ణా! ఇంక నువ్విలా స్త్రీ రూపంలో వుండు" అన్నాడు. అది విని నేను ఏడ్చాను. యక్షులంతా కలిసి కుబేరుణ్ణి ప్రార్ధించగా "శిఖండి బ్రతికి ఉన్నన్నాళ్ళూ నువ్వు ఇలా స్త్రీగా ఉండి, అతడు చనిపోయాక నీ పురుషత్వాన్ని తిరిగి పొందుతావు" అని అనుగ్రహించాడు కుబేరుడు.
అంతట శిఖండి స్థూలకర్ణుడి దగ్గర శెలవు తీసుకుని గబగబ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి వార్త తెలియజేశాడు. ద్రుపదుడు తన అదృష్టానికి మురిసిపోయి దేవతలను, విప్రులను పూజించి నిస్సంకోచంగా ద్రోణాచార్యుడి దగ్గరకు శిష్యుడిగా పంపాడు శిఖండిని. అ తరువాత అస్త్రవిద్యలో ఆరితేరాదు.
అంగనలను, అంగనాపూర్వులనూ, అంగనాకారముగలవాళ్ళను,అంగనా నామధేయము గలవాళ్ళను చంపనని భీష్ముడు వ్రతం పట్టాడు. అందుకే శిఖండిని కురుక్షేత్రములో భిష్ముడు చంపలేదు కాని అతనిని అడ్డు పెట్టుకుని అర్జునుడు భీష్ముడ్ని నేల కరిపించాడు.

No comments:

Post a Comment

My Blog List

chitika